మెగా 154 టీజర్ అప్ డేట్ ఇచ్చిన చిరు

Chiranjeevi Reveals #Mega154 Movie Latest Update, #Mega154 Movie Latest Update, #Mega154, Chiranjeevi, Shruti Haasan, Ravi Teja, KS Ravindra, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Mega154, Mega154 Telugu movie, Mega154 New Update, Mega154 Telugu Movie New Update, Mega154 Movie, Mega154 Latest Update, Mega154 Movie Updates, Mega154 Telugu Movie Live Updates, Mega154 Telugu Movie Latest News, Mega154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈఏడాది చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మొదట ఆచార్య సినిమాను రిలీజ్ చేయగా అది బాక్సాఫీస్ వద్ద అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ అందించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు సినిమాల్లో సెట్ పైన ఉన్న సినిమా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈసినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ప్రీ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు తప్పా మరొక అప్ డేట్ ఇవ్వలేదు. అయితే గత కొద్దిరోజులుగా ఈసినిమా టీజర్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ టీజర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు ఈసినిమాలో గోదావరి యాసలో మాట్లాడతానని.. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలానే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా కన్ఫామ్ చేశారు. మరి దీనిపై అధికారికంగా ప్రకటన త్వరలో వస్తుందేమో చూడాలి.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =