మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NBK107 మూవీ కీలక షెడ్యూల్ టర్కీ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. ఈ మూవీ కై పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఎవరు మారిన మారకపోయినా కూడా తనకు మొదటి నుంచి ఉన్న మాస్ ఇమేజ్ తోనే బాలయ్య బాబు ఊహించిన విధంగా సక్సెస్ అందుకోవడం విశేషం. అఖండ సినిమాతో ఆయన సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.#NBK107 మూవీలో అద్భుతమైన యాక్షన్ సీన్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు డ్యాన్స్ తో కూడా బాలకృష్ణ అలరించనున్నారనీ , ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఒక డ్యూయెట్ అలాగే మరో మాస్ సాంగ్ కూడా డిఫరెంట్ గా ఉండాలనీ దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































