ప్రస్తుతం సౌత్ సినిమాల హవా ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ లిస్ట్ లో పొన్నియన్ సెల్వన్ కూడా చేరిపోయింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్. ‘ఓకే బంగారం’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు కమర్షియల్ హిట్టు లేదు. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 30 వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఈసినిమా రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఈసినిమా ఎక్కడా తగ్గేదేలే అంటుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుండీ ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటూనే వెళుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఒక్క తమిళనాడులోనే దాదాపు 160 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు 150 కోట్లు ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 16 కోట్లకుపైగా ఇలా పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకొని 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. మధ్యలో పలు సినిమాలు రిలీజ్ అయిన కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోవడం మాములు విషయం కాదని చెప్పొచ్చు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: