బన్నీ ఖాతాలో మరో ప్రెస్టేజియస్ అవార్డ్

Allu Arjun gets prestigious award, Icon Star Allu Arjun, Actor Allu Arjun, prestigious award, Pushpa The Rise, Allu Arjun, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa The Rise, Pushpa The Rise Telugu movie, Pushpa The Rise New Update, Pushpa The Rise Telugu Movie New Update, Pushpa The Rise Movie, Pushpa The Rise Latest Update, Pushpa The Rise Movie Updates, Pushpa The Rise Telugu Movie Live Updates, Pushpa The Rise Telugu Movie Latest News, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అల్లు వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొత్తానికి తన తాత, తండ్రికి తగ్గ వారసుడిగా దూసుకుపోతున్నాడు. తాత అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగాా చెప్పనక్కర్లేదు.. తండ్రి టాప్ ప్రొడ్యూసర్ గా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రేంజ్ లో స్టార్ హీరోగా తన కెరీర్ లో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో మరో మెట్టు ఎక్కేసాడు బన్నీ. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంత బ్రహ్మరథం పట్టారో చూశాం. ఇక ఈసినిమాలో పాటలు అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. మొదటిసారి స్టైలిష్ లుక్ నుండి బయటకు వచ్చి.. ఫుల్ మాస్ రోల్ లో నటించిన బన్నీ మేకోవర్ కూడా అందరికీ నచ్చేసింది. ఒక్క ఎలిమెంట్ కాదు పుష్పలో ప్రతిఒక్కటీ నచ్చాయి కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అవార్డుల పరంగా కూడా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గా జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో ఈసినిమా ఈసినిమా దాదాపు అన్ని కేటగిరీల్లో కూడా అవార్డులను సొంతం చేసుకుంది. ఏకంగా 7 అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ విభాగాల్లో పుష్ప సత్తాచాటింది. ఇక ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ అవార్డు సైతం బన్నీకి దక్కినట్టు తెలుస్తుంది. సీఎన్ఎన్ న్యూస్ 18 నిర్వహించే అవార్డుల్లో ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బన్నీకి దక్కినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో జరిగే ఈకార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే.. ఈ అవార్డ్ ఇంతవరకూ షారుఖ్ ఖాన్ ఇంకా రజనీకాంత్ లాంటి లెజెండ్స్ కు మాత్రమే దక్కినట్టు తెలుస్తుంది. మరి అలాంటిది అల్లు అర్జున్ కు ఇలాంటి అవార్డ్ రావడం గ్రేటే కదా..

కాగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా వచ్చింది. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈసినిమాను నిర్మించారు. ప్రస్తుతం అయితే అందరూ పుష్ప2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.