బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెంగుళూరు లో జరిగిన 67 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో సాయి పల్లవి ఉత్తమ నటి గా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.లవ్ స్టోరి మూవీ కి ఉత్తమ నటిగా , శ్యామ్ సింగరాయ్ మూవీ లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ విభాగంలో రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాయి పల్లవి అందుకున్నారు.తన అద్భుతమైన నటనా ప్రతిభను ఈ రెండు సినిమాలతోనూ సాయి పల్లవి చాటుకున్నారు. విమర్శకుల ప్రశంసలు, అలాగే బాక్సాఫీస్ వసూళ్ళ పరంగానూ రెండు సినిమాలూ సత్తా చాటాయి.రెండు అవార్డ్స్ అందుకుని ఆనందంలో ఉన్న సాయి పల్లవి ఆ రెండు మూవీస్ దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: