మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో హీరో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. .“ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆదివారం రాత్రి బెంగుళూరు లో 67 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. పుష్ప;ది రైజ్ మూవీ 7 విభాగాలలో అవార్డ్స్ గెలుపొంది సత్తా చాటింది. ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు సుకుమార్ , ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ , ఉత్తమ గాయకుడు సిద్ శ్రీరామ్ , ఉత్తమ గాయని ఇంద్రావతి చౌహాన్ , ఉత్తమ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రొజెక్ అవార్డ్స్ అందుకున్నారు. ఉప్పెన మూవీ కి ఉత్తమ నూతన నటుడు వైష్ణవ్ తేజ్ , ఉత్తమ నూతన నటి కృతి శెట్టి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: