మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి సాలిడ్ హిట్ ను అందుకున్నారు. ఇంతకుముందు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరుకు ఆ సినిమా అయితే మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. దాంతో మెగాఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. దీంతో మెగాస్టార్ గాడ్ ఫాదర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక వారు పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది . మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఇప్పుడు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు.
విడుదలైన తోలి రోజు నుండి పాజిటివ్ టాక్ రావడం తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు తాజాగా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక యూఎస్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే 1మిలియన్ డాలర్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది. ప్రస్తుతానికి రిలీజ్ సినిమాలు లేవు కాబట్టి ఇంకా ముందు ముందు మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటున్నారు.
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: