మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి మలయాళం లూసిఫర్ సినిమా చూసిన మోహన్ లాల్ పాత్రలో వేరే హీరోని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా రీమేక్ అని చెప్పినప్పటినుండీ మెగా ఫ్యాన్స్ లో కూడా చిన్న టెన్షన్ మొదలైంది. కానీ ఈసినిమా రిలీజ్ అయిన తరువాత ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి చెప్పొచ్చు సినిమా ఎలా ఉందో. ఈసినిమా పేరుకి లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న పేరు మాత్రమే.. మోహన్ రాజా కేవలం ఆ స్టోరీలోని థిన్ లైన్ ను మాత్రమే వాడుకున్నాడు. స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇక అదే రేంజ్ లో చిరు కూడా నటించడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
69.12 crores in 2 Days ❤️🔥
HUMONGOUS BLOCKBUSTER #GodFather setting the box office on fire 🔥
Book your tickets now
– https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfatherMegastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @ProducerNVP pic.twitter.com/yBVyHA5t8D
— Konidela Pro Company (@KonidelaPro) October 7, 2022
ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా సాలిడ్ గా రాబట్టుకుంటుంది. రెండో రోజు ఏకంగా ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20కోట్లకు పైగా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలాఉండగా రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేసింది. మరి రెండు రోజుల్లో ఈసినిమా ఆరేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుందంటే గొప్ప విషయమనే చెప్పాలి.
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: