అభిరామ్ అహింస టీజర్ రిలీజ్

ahimsa movie teaser is out, Abhiram Daggubati, Abhiram Daggubati and Director Teja’s Ahimsa, Abhiram Daggubati’s Ahimsa Movie teaser, Abhiram Daggubati’s Ahimsa, Abhiram’s Ahimsa, Abhiram’s Ahimsa Movie, Ahimsa, Ahimsa teaser, Ahimsa Movie, ahimsa movie teaser, ahimsa movie teaser is out, Ahimsa Movie Update, Ahimsa Telugu Movie, Ahimsa Telugu Movie Live Updates, Ahimsa Telugu Movie Latest Update, Director Teja, teaser of Ahimsa, Latest Telugu Movies News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న ఈసినిమాను ఎప్పుడో త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక‌ ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ ప్రీ లుక్ పోస్ట‌ర్, ఇంకా గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. బాగా చ‌దువుకున్న అమ్మాయి.. అమాయ‌కుడైన అబ్బాయి మ‌ధ్య సాగే ప్రేమ క‌థ‌గా అహింస ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అహింస‌ను న‌మ్మే యువ రైతుగా అభిరామ్ దగ్గుబాటి ఇందులో క‌నిపించ‌బోతున్నారు. అతడి జీవితంలోకి అమ్మాయి రావడంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అహింసను పాటించే అతడు హింసను ఎందుకు ఎంచుకున్నాడనేది మనకు ఈ సినిమా కథగా చూపించనున్నాడు దర్శకుడు తేజ. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్. మరి దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం మరి అభిరామ్ కు మొదటి సినిమా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 19 =