అభిమానుల కోసం 65 థియేటర్స్ లో ఆదిపురుష్ 3D టీజర్

Adipurush 3D Teaser To Be Released In Theaters, Adipurush 3D Teaser, Adipurush Movie Teaser, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush Telugu movie, Adipurush New Update, Adipurush Telugu Movie New Update, Adipurush Movie, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie Latest News, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ  2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ రాముడిగా ఎంట్రీ , పవర్ ఫుల్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ ను కొంతమంది ప్రేక్షకులు విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఆదిపురుష్ 3D టీజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. 3D టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ మాట్లాడుతూ .. త్రీడి వెర్షన్ లో ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుందనీ , తాను ఫస్ట్ టైమ్ ఆదిపురుష్ 3D టీజర్ ను చూసినప్పుడు చిన్నపిల్లాడిని అయిపోయాననీ , విజువల్స్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయనీ , ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా శుక్రవారం 65 థియేటర్లలో ఈ టీజర్ ను ప్రదర్శించబోతున్నామనీ , మరికొన్ని వారాల తర్వాత తప్పకుండా ఒక బ్యాంగ్ అప్డేట్ తో మళ్ళీ వస్తామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =