దసరాకు ఓటీటీలో కార్తికేయ2

Karthikeya 2 Movie OTT Release Date Locked,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Latest Updates,Karthikeya 2 Telugu Movie Latest Updates,Karthikeya 2 Movie OTT Release,Karthikeya 2 Movie Releasing in OTT,Karthikeya 2 OTT Release Date Fixed,Nikhil Siddarth Latest Super Hit Movie Karthikeya 2 Releasing on Dussehra Festival,Karthikeya 2 Telugu Movie Releasing in Zee5 on Dussehra Festival,Karthikeya 2 Telugu Movie in Zee5,Watch Karthikeya 2 Telugu Movie in Zee5,Karthikeya 2 Telugu Movie Streaming in Zee5

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమా కార్తికేయ2. ఎన్నో బ్రేకులు అనంతరం ఫైనల్ గా రిలీజ్ అయింది ఈసినిమా. ఇక కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రాగా ఈసీక్వెల్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికీ కూడా అక్కడక్కడా ఈసినిమా సందడి చేస్తూనే ఉంది. ఇక సౌత్ లో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అదే నమ్మకంతో నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. ఇక మేకర్స్ నమ్మకం నిజం చేస్తూ నార్త్ ఆడియన్స్ కూడా ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా తెలుగుతో పాటు నార్త్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా ఈసినిమా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోతుంది. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 5వ తేదీన జీ5లో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక థియేటర్లలో చూడనివారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

ఇక కార్తికేయ2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కార్తికేయ3 కూడా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక కార్తికేయ3 సినిమాకు భారీ స్థాయిలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు నిఖిల్ కూడా ఈసినిమా గురించి అప్పట్లో చెబుతూ ఇంటర్నేషనల్ లెవల్ లో ఇంకా 3డీ ఫార్మెట్ లో రూపొందించనున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎప్పుడు మొదలుపెడతారో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 10 =