హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Comedian Srivastava Passed Away, Raju Srivastava The Popular Stand-up Comedian Passes Away Today In Delhi, The Popular Stand-up Comedian Passes Away Today In Delhi, Raju Srivastava Passes Away Today In Delhi, The Popular Stand-up Comedian, Popular Stand-up Comedian Raju Srivastava, Raju Srivastava, Comedian Raju Srivastava had been in the hospital for the last 41 days, Stand-up Comedian, Comedian Raju Srivastava, The Great Indian Laughter Challenge, Maine Pyar Kiya, Satya Prakash Srivastava, Comedian Raju Srivastava passes away at 58, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest News, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఈమధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందారు. రీసెంట్ గానే టాలీవుడ్ లో మరో దిగ్గజ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా శ్రీవాస్తవ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొన్నిరోజుల క్రితం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు శ్రీవాస్తవ. దాంతో అతనిని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి నుండి అక్కడే చికిత్సపొందుతున్నారు. కానీ నేడు పరిస్థితి కాస్త విషమించడంతో తుది శ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా స్టాండప్ కమెడియన్ గా అలానే మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాజు శ్రీవాస్తవ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
1963 డిసెంబరు 25న కాన్పూర్‌లో జన్మించిన రాజు శ్రీవాస్తవ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ షోతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ‘మైనే ప్యార్ కియా’, ‘బాజీగర్’, ‘బాంబే టు గోవా’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు రియాలిటీ షోస్ లో కూడా పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొని అభిమానులను అలరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =