సీతా రామం మూవీపై బాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ప్రశంసలు

Bollywood Director Vivek Agni Hruthi Is all praises for Sita Ramam Movie, Vivek Agni Hruthi Is all praises for Sita Ramam Movie, Bollywood Director Vivek Agni Hruthi, Director Vivek Agni Hruthi, Vivek Agni Hruthi, Dulquer Salmaan And Mrunal Thakur's Sita Ramam, Rashmika Mandanna, Hanu Raghavapudi, Sita Ramam, Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Sita Ramam Movie Updates, Sita Ramam Telugu Movie Updates, Sita Ramam Telugu Movie Live Updates, Sita Ramam Movie Latest Collections, Sita Ramam Movie New Collections, Sita Ramam Movie Latest News And Updates, Sita Ramam 2, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతా రామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది.సీతా రామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ , 40 కోట్లు షేర్ సాధించి, దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ సినిమాపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. సీతా రామం సినిమా ఓ అద్భుత దృశ్యకావ్యం అనీ , దుల్కర్ సల్మాన్‌ నటన తనను బాగా ఆకట్టుకుందనీ , అతడి నటన చాలా నేచురల్ గా ఉందనీ , చాలా రీఫ్రెష్ గా అనిపించిందనీ , యువ నటి మృణాల్ ఠాకూర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువేననీ , తొలిసారి ఆమె నటన చూశాననీ , చాలా సహజంగా ఉందనీ ,సీతా రామం చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు అంటూ వివేక్ అగ్ని హోత్రి ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =