కొత్తవాళ్లు వస్తే మన తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. ఇక ఇప్పుడు అదే నమ్మకంతో మరోసారి వచ్చేస్తున్నాడు అజయ్ కతుర్వార్. ఇటీవల విశ్వక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్ ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నాడు. అజయ్ గాడు అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా నుండి ఇటీవలే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేక్ర్స్. ఇక టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టి అజయ్ కతుర్వార్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్, యాక్షన్, రొమాన్స్ మరియు ఎమోషన్‌ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరి ఆసక్తిని రేకెత్తించింది. బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.
Don’t miss out on the invigorating Teaser of #AjayGadu, out now on @telugufilmnagar
🔗 https://t.co/cMqPcZYW2P #AK1 @AKProductions_ @ajaykathurvar @ChandanaKoppis1 #TeamA @Bhanu333Bb @TheShwetaMehta #AbhayBethiganti @MangoMusicLabel pic.twitter.com/UW0xNhueoj
— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2022
కాగా ఈసినిమాకు అజయ్ కతుర్వార్ దర్శకత్వం వహించాడు. చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. భాను శ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్లుగా నటించారు.
అజయ్ నాగ్ మరియు హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని అందించగా… కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: