ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించిడానికి వచ్చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న సినిమా ది ఘోస్ట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున మాజీ ‘రా’ ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటినుండే మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుండి పోస్టర్లు, గ్లింప్స్ ను అలానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈసినిమా నుండి వేగం పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాటను చూస్తుంటే రొమాంటిక్ నంబర్ లాగ కనిపిస్తుంది. భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటకు సంగీతం అందించగా.. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
❤️❤️Love is in the air❤️❤️
🏍 🛥 Speed is in his nature ✈️ 🚘
👑 King is here to steal your 💕 💕with #Vegam from #TheGhosthttps://t.co/NzjaVXHLwY#TheGhostOnOct5@iamnagarjuna @sonalchauhan7 @SVCLLP @nseplofficial @iamMarkKRobin @bharattsaurabh @SonyMusicSouth pic.twitter.com/iAspPBU2Wh— Praveen Sattaru (@PraveenSattaru) September 16, 2022
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: