శ్రీ విష్ణు అల్లూరి ట్రైలర్ రిలీజ్

Alluri Movie Trailer Released, sree vishnu alluri Movie trailer, alluri Movie trailer, sree vishnu alluri Movie, sree vishnu alluri Telugu Movie, alluri Telugu Movie trailer, Sree Vishnu starrer Alluri, Sree Vishnu And Kayadu Lohar's alluri Movie trailer, Sree Vishnu's alluri Movie trailer, hero Sree Vishnu's new film, Sree Vishnu's Upcoming film, alluri, Sree Vishnu, Kayadu Lohar, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

విభిన్నమైన పాత్రలతో డిఫెరెంట్ కథలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. ఎప్పటికప్పుడు తను చేసే సినిమాల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. అందుకే ప్రేక్షకులు కూడా శ్రీ విష్ణు సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు. ఈ ఏడాది భళా తందనాన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఈసినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. సెప్టెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. లక్ష్యం పెట్టుకోవడం దాన్ని సాధించడం గొప్పకాదు.. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం అంటూ తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీవిష్ణు ఎంట్రీ చూపిస్తారు. అంతేకాదు పోలీసులే నిజమైన హీరో అంటూ.. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలి అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి శ్రీవిష్ణు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించడానకిి వచ్చేస్తున్నాడు. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =