గాడ్ ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్ ఫుల్ సాంగ్ రిలీజ్

Thaar Maar Thakkar Maar Song from God Father Out Now, God Father Thar Maar Thakkar Maar Song, Thar Maar Thakkar Maar Song Out Now, Thaar Maar Thakkar Maar Song, Thaar Maar Thakkar Maar, Chiranjeevi's Political Thriller, Chiranjeevi's Godfather movie, Godfather movie, Godfather Telugu movie, Godfather, Godfather Update, Godfather Movie Latest Update, Megastar Chiranjeevi's Godfather, Chiranjeevi And Nayanthara Starrer Godfather movie, Mohan Raja, Godfather Movie Latest News And Updates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Salman Khan, Lucifer

రీసెంట్ గా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. తార్ మార్ తక్కర్ మార్ అంటూ ఈపాట సాగుతుంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై చిత్రీకరించిన ఈప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. థమన్ సంగీతం అందించిన ఈపాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫి అందించాడు.

కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =