రీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్.. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. రీసెంట్ గానే పవన్ పుట్టినరోజు సందర్భంగా చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిన్న గ్లింప్సే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా పవన్ ఖాతాలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈసినిమాలే ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో తెలియదు. అలాంటిది ఇప్పుడు తాజాగా రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలను తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక ఈవార్తలపై డీవీవీ బ్యానర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. తన బ్యనర్ నుండి వచ్చే ప్రతి ప్రాజెక్ట్ పై మా నుండే అధికారిక ప్రకటన వస్తుంది.. ఎలాంటి రూమర్స్ ను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Any information about any of our future projects will be made official by us. Please do not believe in any speculations.
— DVV Entertainment (@DVVMovies) September 5, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.