పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వనాంగాన్ తమిళ మూవీలో నటిస్తున్నారు. అచలుడు పేరుతో ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది.హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించిన విక్రమ్ , రాకెట్రి సినిమాలు మాత్రం భారీ విజయాలను అందుకున్నాయి. యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో తెరకెక్కుతున్న సూర్య 42 మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Truly a beautiful and blessed 25years..! Dream and believe..!
Your suriya.— Suriya Sivakumar (@Suriya_offl) September 6, 2022
దర్శకుడు మణిరత్నం స్వంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పై వసంత్ దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ హిట్ నేరుక్కు నేర్ (1997 ) మూవీ తో సూర్య కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుమారు 50 చిత్రాలలో నటించిన హీరో సూర్య తన 25 సంవత్సరాల సినీ జర్నీ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా లో స్పందించారు. నిజంగా ఒక బ్యూటిఫుల్ అండ్ బ్లెస్డ్ 25 ఇయర్స్ , డ్రీమ్ అండ్ బిలీవ్ మీ సూర్య అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: