ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ‘కెప్టెన్’

Arya interview about Captain movie, Captain And The Predator Are Not Alike, The Predator, Kollywood actor Arya, Arya interview, Captain movie interview, Captain Telugu Movie Review,Captain Movie Review,Captain Review,Captain Telugu Review,Captain Movie Review In Telugu, Captain Telugu Movie (2022),Captain,Captain Movie,Captain Telugu Movie,Captain Review - Telugu,Captain Movie Reviews, Captain - Telugu Movie Reviews,Captain Movie Public Talk,Captain Movie Public Response,Captain Movie Updates, Captain Telugu Movie Updates,Captain Telugu Movie Live Updates,Captain Telugu Movie Latest News, Captain Movie Plus Points,Captain Movie Highlights,Captain Movie Story,Captain (2022),Captain (2022) - Movie, Captain Movie First Review,Captain (2022) Telugu Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

ఆర్య కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. ఇక ఈసినిమా సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మరియు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కెప్టెన్’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? విన్న తర్వాత మీ స్పందన ఏంటి?
శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా. ఆ సినిమా తర్వాత ‘కెప్టెన్’ కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఆల్రెడీ శక్తితో పని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక… ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే… పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, మా సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.

‘ప్రెడేటర్’ సినిమాలా ఉంటుందా?
ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత ‘ప్రెడేటర్’లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బావుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.

‘కెప్టెన్’ షూటింగ్ చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయాలు ఏంటి?
వీఎఫ్ఎక్స్ వర్క్స్. ఇటువంటి సినిమాలు హాలీవుడ్‌లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారు. నటుడిగా ఛాలెంజింగ్ అంటే…. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడం! ప్రచార చిత్రాల్లో చూపించిన జీవి నటీనటుల ముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే… భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవి షూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి పైకి రాలేను కదా! అందుకని, స్కూబా డైవింగ్ కు ఉపయోగించే ఎక్విప్‌మెంట్‌ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ఇదే అనుకుంట!
అవును. ‘కెప్టెన్’లో క్రియేచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడు శక్తికి వీఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి… నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్టు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు.

మీరు ‘వాడు – వీడు’ వంటి విభిన్నమైన సినిమాలు కెరీర్ స్టార్టింగ్‌లో చేశారు. ఇప్పుడు ‘టెడ్డీ’, ‘సార్‌ప‌ట్ట‌’, ‘కెప్టెన్’… డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ జానర్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నమా?
అలా ఏమీ లేదు. నా దగ్గరకు కథలు వస్తున్నాయి. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రిస్కీ స్క్రిప్ట్ ఉన్న దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే ఆర్య చేస్తాడని నా దగ్గరకు వస్తున్నారు. ఆర్య ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. నాతో ఛాన్స్ తీసుకుంటారు.

కథ విన్నాక… సెట్స్ మీదకు వెళ్లే ముందు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
ఆర్మీ సినిమా కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకున్నాం. అందుకని, కాస్ట్యూమ్ అన్నీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ కోసం యూనిఫామ్ కుట్టేవాళ్ళ దగ్గర కుట్టించాం. కలర్ నుంచి ఏ విషయంలో తప్పు జారగకూడదని చూశాం. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో ఉండేలా చూసుకున్నాం. గన్ పట్టుకోవడం నుంచి రన్నింగ్, ఉన్నత అధికారులకు సెల్యూట్ చేసే వరకూ ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం.

తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తోంది. వాళ్ళ గురించి…
నితిన్ నాకు మంచి ఫ్రెండ్. కమల్ హాసన్ గారి ‘విక్రమ్’తో భారీ హిట్ అందుకున్నారు. ‘కెప్టెన్’ ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను.

‘కెప్టెన్’కు సీక్వెల్ ఉంటుందా?
‘టెడ్డీ’ సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా! అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. ‘కెప్టెన్’ మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది.

మళ్ళీ తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు.

తెలుగులో మీ సినిమాలు చాలా అనువాదం అయ్యాయి. మీకు ఎక్కువ గుర్తింపు ఇచ్చిన సినిమా?
‘రాజా రాణి’. అందులో మరో సందేహం లేదు. ‘కెప్టెన్’ కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు, ఇతర ప్రాజెక్టులు…
సిద్ధార్థ్ ‘గృహం’ తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం ‘విలేజ్’ వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీ హీరోగా ‘విరుమాన్’ తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా.

మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
డ్రీమ్ రోల్ ఏదీ లేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.