సీతారామం హిందీ ట్రైలర్ రిలీజ్

Sita Ramam Hindi Trailer Released,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Hindi Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Hindi Movie Trailer,Sita Ramam Hindi Trailer Released,Sita Ramam Hindi Trailer Response,Sita Ramam Hindi Movie latest Updates,Sita Ramam Dulquer Salmaan Hindi Movie Trailer,Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan Sita Ramam Hindi Movie Trailer Out Now,Dulquer Salmaan Next Projects

మన సౌత్ సినిమాలు నార్త్ లో ఇప్పుడు మంచి హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న సినిమాల్లో దాదాపు చాాలా సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాయి. అందుకే మేకర్స్ కూడా ఈమధ్య హిందీలో సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు సౌత్ లో సూపర్ హిట్ అయిన సీతారామం సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో అవుట్ అండ్ అవుట్ ప్రేమకథగా వచ్చిన సినిమానే సీతారామం. ప్రేమకథలు ఆడుతాయా అన్న అనుమానాలన్నిటిని బ్రేక్ చేసి ఈసినిమా క్లాసిక్ హిట్ ను అందించింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈసినిమా. ఆర్ఆర్ఆర్ సినిమాను హిందీలో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ సీతారామం సినిమా హిందీ రిలీజ్ హక్కులను సొంతం చేసుకొని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన హిందీ వెర్షన్ ను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈసినిమా నార్త్ ఆడియన్స్ కు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.