వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని 2023 అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినాయక చవితి సందర్భంగా ప్రాజెక్ట్ K స్క్రిప్ట్‌ను గణనాథుడి వద్ద పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశారనీ , ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి విఘ్నేశ్వరా.అనీ , .అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలనీ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రాజెక్ట్ k మూవీని మహాభారతంతో పోల్చడంతో ఆ రేంజ్ కథ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























