సినిమా జయాపజయాలతో పని లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఆతర్వాత లవ్లీ సినిమాతో మరో హిట్ ను అందుకోవడంతో ఆదికి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనుకున్నారు అందరూ. అయితే ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ మంచి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితే అవకాశాలకు మాత్రం ఎలాంటి కొదువలేదు ఆదికి. దానికి నిదర్శనమే ఆది లిస్ట్ లో ఉన్న సినిమాలు. ప్రస్తుతం ఆది లిస్ట్ లో చాలా సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటే క్రేజీ ఫెలో సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచుతున్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. “సినిమా స్టైల్ లో ఒక్క పంచ్ లైన్ లో మనోడి గురించి చెప్పాలంటే.. మందు తాగితే లివర్ పోతుంది.. సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి.. వీడితో ఉంటే దూల తీరిపోతుంది” అంటూ మొదలవుతుంది టీజర్. ఎలాంటి పనిపాటా లేని ఆవారా లాగ ఆది పాత్రను చూపించారు. టీజర్ లో ఆది పాత్ర చాలా క్రేజీగా కనిపిస్తుంది. మొత్తానికి ఫన్ ఫిల్డ్ ఎంటర్ లైనర్ లాగ అనిపిస్తుంది ఈటీజర్ ను చూస్తుంటే. టీజర్ అయితే ఈసినిమాపై అంచనాలను పెంచేసింది.
A fun-filled teaser of Crazy Fellow is Out Now! 🤗
In theatres from October 14th.Link : https://t.co/0F8m0b1Ixv#CrazyFellow pic.twitter.com/aH2Tr6wID8
— Aadi Saikumar (@iamaadisaikumar) September 1, 2022
కాగా ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవన్షీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్, వినోదిని వైద్యనాథన్, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: