మార్క్ అంథోని నుండి విశాల్ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Poster Released From Vishals Mark Antony Movie, Vishal's Mark Antony Movie, Mark Antony Movie, Mark Antony Movie First Look Poster, First Look Poster, Mark Antony first look, Mark Antony First Look Poster, Vishal's upcoming film Mark Antony, Mark Antony, Vishal's upcoming Movie, Vishal's Latest Movie, Mark Antony Movie Latest News And Updates, Vishals Mark Antony Movie First Look Out Now, Hero Vishal, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. సెప్టెంబర్ 15 వ తేదీన తమిళ , తెలుగు భాషలలో ఈసినిమా రిలీజ్ కానుంది. దీనితోపాటు డిటెక్టివ్ 2 సినిమాకూడా చేస్తున్నాడు. డిటెక్టివ్ 2 మూవీ కి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలతో పాటు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మార్క్ అంథోని అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇక నేడు విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి విశాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ పవర్ లుక్ చూస్తుంటే మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నట్టు అర్థమవుతుంది.

కాగా విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − one =