ది ఘోస్ట్ మూవీ టీమ్ కు కాజల్ అగర్వాల్ ఆల్ ది బెస్ట్

Kajal Aggarwal conveys her best wishes to Ghost Movie Team,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Best Wishes To Ghost Movie Team,The Ghost Movie,The Ghost Movie Team,The Ghost Movie Trailer Released,Kajal Aggarwal Conveys Her Best Wishes To The Ghost Movie Team,Actress Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Upcoming Projects,Kajal Aggarwal Latest Shoot updates

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజాగా ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. థ్రిల్లింగ్, యాక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో రూపొందిన ది ఘోస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ది ఘోస్ట్ మూవీ లో ముందుగా కాజల్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. కాజల్ పైకొంత మేరకు చిత్రీకరణ కూడా జరిగింది. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డం, ఆ త‌ర్వాత కాజ‌ల్ పెళ్లి చేసుకోవ‌డం.. ఆ వెంట‌నే ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ఈ మూవీ నుండి కాజల్ వైదొలిగారు . తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైన తరువాత ది ఘోస్ట్ మూవీ టీమ్ కు కాజల్ సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాజల్ ఇప్పుడు సినిమాలకు రీ ఎంట్రీ కై ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =