గౌతమ్ బ్రేక్ అవుట్ ఫస్ట్ లుక్ రిలీజ్

Gouthams Break Out Movie First Look Poster is Out,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Break Out, Break Out Telugu Movie,Break Out Movie Latest Updates,Break Out New Movie Updates, Break Out First Look Poster Released,Break Out First Look Poster,Break Out First Look Poster Out Now,Break Out Latest Poster Released,Hero Goutham,Goutham,Goutham Latest Movie Break Out Movie Released,Goutham First Look From Break Out Movie Released,Break Out Telugu Movie First look Poster Released

ఇండస్ట్రీలోకి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అందుకుంటారు. కొంతమంది మాత్రం సరైన సక్సెస్ అందుకోలేరు. అందులో కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కూడా ఒకరు. బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు గౌతమ్. పలు సినిమాల్లో నటించినా కూడా హీరోగా మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నా గౌతమ్ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక తరువాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ మధ్య మను అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు కానీ అది కూడా కాస్త నిరాశ పరిచింది. దీంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు గౌతమ్ ‘బ్రేక్ అవుట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. సుబ్బు చెరుకూరి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈసినిమాప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాటైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్రేక్ అవుట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన చిత్రయూనిట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం ఆకట్టుకుంటుంది. పోస్టర్ ను బట్టి గౌతమ్ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నట్టు అర్థమవుతుంది.

ఈ మూవీని ఏఎంఎఫ్ బ్యానర్ పై అనీల్ మెడుగా నిర్మిస్తున్నారు. జాన్స్ రుపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ బసవ ఎడిటర్ గా చేస్తున్నారు. చూద్దాం మరి ఈ బ్రేక్ అవుట్ తో అయినా గౌతమ్ కెరీర్ కు మంచి బ్రేక్ వస్తుందేమో.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =