హిందీ లో కార్తికేయ2 హవా

Karthikeya 2 Movie Gets Superb Response In Hindi,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Hindi Version Movie,Karthikeya 2 Collections in Hindi,Karthikeya 2 In Bollywood,Karthikeya 2 Superb Response in Hindi,Nikhil Siddharth,Hero Nikhil Siddharth Upcoming Movie,Nikhil Siddharth Latest Movie,Nikhil Siddharth Karthikeya 2 Movie Superb Response in Hindi,Karthikeya 2 Hindi Version Latest Response,Karthikeya 2 Movie Response in Bollywood

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రచారాలతో కూడా పని లేదు అని అప్పుడప్పుడు కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. కంటెంట్ ఉంటే ప్రచాారాలతో పనిలేకుండా ప్రేక్షకులు సినిమాలు ఆదరిస్తారని నిరూపిస్తుంటారు. ఇప్పటికే అది చాలా సినిమాల విషయాల్లో రుజువవ్వగా కార్తికేయ2 సినిమాతో మరోసారి నిరూపించారు. ఇంతకు ముందు పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. పుష్ప సినిమాకు సౌత్ లో చేసినంతగా నార్త్ లో ప్రమోషన్స్ ను చేయలేదు మేకర్స్. సమయం ఎక్కువగా లేకపోవడంతో రిలీజ్ చేసేశారు. కానీ ఆ సినిమా టాక్ తోనే నార్త్ లో కూడా ప్రభంజనాలు సృష్టించింది. ఇక కార్తికేయ టీం అయితే నార్త్ లో అస్సలు ప్రమోషన్స్ చేయలేదు. అయినా కూడా రిలీజ్ చేసేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అవ్వస్తున్నా కూడా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఇంకా ఈసినిమా సాలిడ్ గా నడుస్తుంది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా నార్త్ లో ఇంత టాక్ తెచ్చుకుంటుందని ఎవ్వరూ కూడా ఊహించనట్టుగా దూసుకుపోతుంది. నార్త్ లోనే ఈసినిమా 50 కోట్లకు చేరువలో ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటివరకూ ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ సెలెబ్రేషన్స్‌ను నేడు సాయంత్రం 5 గంటలకు ఏపీలోని కర్నూల్ పట్టణంలో జరుపనున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా కార్తికేయ2 టీమ్ విడుదల చేసింది.

కాగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో నిఖిల్ హీరోగా నటించాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =