నాని దసరా రిలీజ్ డేట్ ఫిక్స్

Dasara Movie Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar, Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara New Movie Updates,Dasara Release Date Fixed,Dasara Natural Star Nani Movie,Natural Star Nani,Nani,Nani Upcoming Movie Dasara, Nani Upcoming Movie Dasara Release Date Fixed,Dasara Telugu Movie Release Date Fixed,Dasara Movie Release Date Announced

విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో చేయబోతున్నాడు. మేకోవర్ ను పూర్తిగా మార్చేసి ప్రయోగాత్మకంగా రాబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ లో నాని సిల్క్‌ స్మితా ముందు కూర్చుని కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.