పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వనాంగాన్ తమిళ మూవీలో నటిస్తున్నారు. అచలుడు పేరుతో ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది.హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించిన విక్రమ్ , రాకెట్రి సినిమాలు మాత్రం భారీ విజయాలను అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో తెరకెక్కుతున్న సూర్య 42 మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయ్యింది.దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ లో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ పేరు పరిశీలన లో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ ఈ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: