టాలీవుడ్ స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. పాన్ ఇండియా మూవీస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలకు ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజు కు పెరుగుతుంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. పుష్ఫ:ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ కు క్రేజ్ మరింత పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ నార్త్ లో అడుగుపెట్టకపోయినా మహేశ్ బాబుకు 37.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. టాలీవుడ్ లో గతం నుంచే టాప్ హీరోలలో మొదటి స్థానంలో ఉన్న మహేష్ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ తోయూత్ లోఅధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో 30.1 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ 3లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఇప్పటికే చెర్రీకి నార్త్ లోనూ అభిమానులు పెరిగిపోయారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆటకట్టుకోవడంతో రామ్ చరణ్ కు నార్త్ లోనూ అభిమానులు ఏర్పడ్డారు. స్టార్ హీరో రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో దాదాపు 30 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ అభిమానులను సాధించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇండియాలో కాకుండా జపాన్, యూ యస్ వంటి దేశాల్లోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోయినా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా లో 17.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























