8 వారాల తరువాతే ఓటీటీ లో సినిమాలు – దిల్ రాజు

Dil Raju Gives Clarity about OTT Releases,Dil Raju Clarifies On Ticket Rates, OTT Releases And Other Issues In Tollywood: Producer Council Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Dil Raju,Ace Producer Dil Raju,Producer Dil Raju in Press Meet,Dil Raju Clarifies on Ticket Rates and OTT in Producer Council Press Meet,Dil Raju About OTT Releases.Dil Raju in Producer Council Press Meet,Dilu Raju on Tollywood Issues Ticket Prices and Movie OTT Releases,Dil Raju Producer Council Press Meet

గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు నిర్మాతల సమావేశంలో షూటింగ్స్ ప్రారంభం , థియేటర్స్ సమస్యలు , ఓటీటీ స్ట్రీమింగ్ , నిర్మాణ వ్యయం, రేట్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. అగ్ర నిర్మాత ఈ సందర్భంగా మాట్లాడుతూ .. షూటింగ్స్‌ ఎప్పుడు పునఃప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, రాబోవు రెండుమూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనీ ,
ఇక నుంచి విడుదలయ్యే సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలని నిర్ణయం తీసుకున్నామనీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్‌లో రిలీజైన 50 నుంచి 60రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తాయనీ , ఈ విషయంలో నిర్మాతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారనీ , థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్‌, బేవరేజెస్‌ ధరల విషయంలో వాటి యాజమాన్యాలతో మాట్లాడామనీ , తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారనీ , మల్టీప్లెక్స్‌, సింగిల్‌స్క్రీన్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించడానికి కూడా అంగీకరించారనీ , అయితే వీపీఎఫ్‌ ఛార్జీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ , శుక్రవారం ఎగ్జిబిటర్స్‌తో సమావేశం నిర్వహించి తుది నిర్ణయాల్ని ప్రకటిస్తామనీ , నిర్మాణ వ్యయం విషయంలో మా (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌)తో ఓ ఒప్పందం చేసుకున్నామనీ , ఫెడరేషన్‌తో కూడా చర్చలు పూర్తయ్యాయనీ , వాళ్లు కోరుతున్న వేతనాల్ని చెల్లించేందుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారనీ , షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని తదుపరి సమావేశాల్లో నిర్ణయిస్తామనీ దిల్ రాజు చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =