పలు బ్లాక్ బస్టర్ మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడమే ధ్యేయం గా దూసుకుపోతోన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హీరో రవితేజ మల్టీ స్టారర్ మూవీస్ పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించే ఒక మల్టీ స్టారర్ మూవీ కై రవితేజ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























