బ్రేక్ ఈవెన్ చేరువలో కార్తికేయ 2

Karthikeya 2 Movie Breakeven to be Done Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Karthikeya 2, Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Pan Indian Movie,Karthikeya 2 Latest Collections,Karthikeya 2 Breakeven Point,Nikhil Siddharth latest Blockbuster Movie Karthikeya 2, Karthikeya 2 Telugu Movie Breakeven to be Done Soon,Chandoo Mondeti,Karthikeya 2 Movie Director Chandoo Mondeti

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “కార్తికేయ 2” ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మూడు కోట్ల 50 లక్షల వసూళ్ల సాధిస్తే రెండో రోజు మూడు కోట్ల 81 లక్షల వసూళ్లు సాధించి రెండు రోజులకు గాను ఏడు కోట్ల 31 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. “కార్తికేయ 2” మూవీ 13 కోట్ల 30 లక్షలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాగా ఈ సినిమా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏడు లక్షల షేర్ వసూలు సాధించి బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది. ఇంకా మూడు కోట్ల 23 లక్షలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే. సోమవారం వీక్ డే అయినా సరే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెలవు ప్రకటించడంతో సోమవారం నాటికి బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + eleven =