సలార్ అప్ డేట్ కు టైమ్ ఫిక్స్

prabhas Salaar Movie Update To Be Out Shortly,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Update,Prabhas Salaar Movie Update,Salaar,Salaar Movie,Salaar Movie Update,Salaar Movie Latest Update,Salaar Movie Release Date,Salaar Telugu Movie Latest News,Prabhas’ Salaar Update,Prashanth Neel,Salaar Announcement,Salaar Update,Salaar Release Date

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు కె.జి.యఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఈసినిమాను కూడా ప్రశాంత్ నీలే ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరిశకు వచ్చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. ఈసినిమా నుండి రెండు రోజుల్లో అప్ డేట్ వస్తుందన్న వార్త నిన్నటి నుండి జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేసే అప్ డేట్ వచ్చేసింది. ఈవార్తను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. సలార్ సినిమా నుండి ఆగష్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకు అప్ డేట్ ఇస్తున్నట్టు తెలిపారు. మరి ఏం అప్ డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఇప్పటినుండే ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =