నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కార్తికేయ2 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా హిట్ తో ఈసినిమాపై ఫస్ట్ నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచాయి. మరి నేడు ఎన్నోఅంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, అనుపమ్ ఖేర్, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు
డైరెక్టర్.. చందూ మొండేటి
బ్యానర్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు.. టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం..కాలభైరవ
సినిమాటోగ్రఫీ.. కార్తీక్
కథ..
కార్తికేయ చూసిన వారికి కథ గుర్తుండేఉంటుంది. సుబ్రహ్మణ్యపురం లోని గుడిలో జరిగే ఘటనల ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసీక్వెల్ లో ద్వారకలోని శ్రీకృష్ణడు కాలి కంకణం చుట్టూ కథ నడుస్తుంది. కార్తికేయ (నిఖిల్) డాక్టర్ గా పనిచేస్తుంటాడు. మరోవైపు ద్వారకలో జరిగే పరిస్థితుల వెనుక రహస్యాన్ని వెతుకుతాడు. ఆక్రమంలోనే కొన్ని పురాతన నమ్మకాలకు మరియు ద్వారకలోని శ్రీకృష్ణుని శక్తికి సంబందించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అయితే చివరకు కార్తికేయ ఆ రహస్యాలను కనుగొన్నాడా లేదో అనేది మిగిలిన కథ..
విశ్లేషణ..
ఒక సూపర్ హిట్ సినిమాకు మళ్లీ సీక్వెల్ తీయాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు. ఈసారి తీసే సీక్వెల్ మొదటి పార్ట్ ను మించి ఉండాలి.. దానికి తగినట్టు కథ రాసుకోవాలి.. ప్రేక్షకులను కథతో ఎంగేజ్ చేయాలి. అందుకే సీక్వెల్ తీయడం అంటే దర్శకుడికి కాస్త ప్రెజర్ లాంటిదే. అందులోనూ సీక్వెల్ అంటే మన దగ్గర అంత మంచి సక్సెస్ రేటు కూడా లేదు.. అందుకే సీక్వెల్ అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కార్తికేయ 2 పరిస్థితి కూడా అదే. కార్తికేయ సినిమా సూపర్ హిట్. నిఖిల్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ కార్తికేయ2.
అయితే ఈసినిమా కు ప్లస్ పాయింట్ ఏంటంటే.. కార్తికేయ సినిమాకు కంటిన్యూషన్ గా ఈసినిమాను తెరకెక్కించాడు చందూ మొండేటి. ఈసినిమా కథ టోటల్ గా డిఫరెంట్ ప్లాట్ తో నడుస్తుంది. ఇక ఈసినిమాను కూడా చందూ మొండేటి ఎక్కడ కూడా ప్రేక్షకులకి బోర్ ఫీలింగ్ లేకుండా చేశాడు. ఇలాంటి ఈసినిమాలకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సినిమా ఫస్ట్ నుండి చివరు వరకూ ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని ఉంచాలి. ఆ విషయంలో చందూ మొండేటి కూడా సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో మిస్టరీ అనేది ప్లస్ పాయింట్.. ఫాంటసీగా ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాకు ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, అలానే పర్ఫెక్ట్ క్లైమాక్స్ ను అందించాడు చందూ. ద్వారకకు అలానే ప్రస్తుత ఆధునిక కాలాన్ని మధ్య వారధిగా శ్రీకృష్ణుని కంకణానికి సంబంధిచిన కథను అల్లడం.. అలానే అడ్వంచరస్ కథలో ఆధ్యాత్మికత ఇంకా దేవుడికి, మానవత్వానికి సంబంధం ఇలా పలు విషయాలను చాలా చక్కగా డీల్ చేశాడు
ఇక ఈసీక్వెల్ లో కూాడా నిఖిల్ హీరో. ఇక మొదటి సినిమాలో నిఖిల్ మెడికల్ స్టూడెంట్ గా నటించగా.. ఈసీక్వెల్ లో డాక్టర్ గా నటించాడు. కార్తికేయ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన నటనతో మరోసారి మెప్పించాడు నిఖిల్. ఇక అనుపమ పరమేశ్వరన్ కు కూడా మంచి పాత్రే దక్కింది. నిఖిల్ తో పాటు సమానంగా ఉండే పాత్రే. ముగ్ద పాత్రలో తను కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక కీలక పాత్రలో నటించగా తను కూడా బాగానే నటించాడు. ఆదిత్య మీనన్ నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. ఇక శ్రీనివాస రెడ్డి కొన్ని సన్నివేశాల్లో తన టైమింగ్‌తో నవ్వించాడు. నిఖిల్ స్నేహితులిగా నటించిన సత్య, ప్రవీణ్ ఇంకా సులేమాన్ పాత్రలో నటించిన వైవా హర్షతోపాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల మేర మెప్పించారు.
టెక్నికల్ వ్యాల్యూస్ కూడా ఈసినిమాకు మరో బలం. ముఖ్యంగా విజువల్స్ ఈసినిమాకు ప్రధాన బలం.. కార్తీక్ అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కాశ్మీర్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కాల భైరవ సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరో హైలెట్. నిర్మాణ విలువలు సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాప్ తీసుకొని వచ్చినా నిఖిల్ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడ్వంచరస్ సినిమాగా వచ్చిన కార్తికేయ2 ప్రతి ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చుతుంది.. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: