‘హనుమాన్’ అప్ డేట్.. కొన్ని రోజులు భరించండి..!

Prashanth Varma Updates about Hanuman Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Prashanth Varma,Director Prashanth Varma,Prashanth Varma Hanuman Movie Latest Updates,Hanuman Movie,Hanuman Telugu Movie,Amritha Aiyer,Actress Amritha Aiyer,Actress Varalaxmi Sarathkumar,Director Prasanth Varma,Hero Teja Sajja

విభిన్నమైన చిత్రాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తను హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాను తీసిన జాంజిరెడ్డి సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జానే ఈసినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అంతేకాదు సినిమా రిలీజ్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా ప్రశాంత్ వర్మను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అడిగేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమా గురించి ఓ తాజా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హనుమాన్ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనుల్లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నామని.. సినిమాను మంచి ఔట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేయాలని అనుకోవడం లేదని ప్రశాంత్ వర్మ తెలిపాడు. మొత్తానికి హనుమాన్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చాడు.

కాగా ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =