రీసెంట్ గా హీరో శివ కార్తికేయన్ “వరుణ్ డాక్టర్ “, “డాన్”మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “ప్రిన్స్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివకార్తికేయన్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాంతి టాకీస్ బ్యానర్ పై మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ , ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ ఎస్ తనయ అదితి శంకర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మావీరన్” తమిళ మూవీ, తెలుగు వెర్షన్ “మహా వీరుడు” మూవీ షూటింగ్ పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమానికి భారీ చిత్ర దర్శకుడు శంకర్ ముఖ్య అతిథి గా పాల్గొని చిత్ర యూనిట్ కు విషెస్ తెలిపారు.హీరోయిజం ఉండే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామనీ, కథా నేపథ్యం, హీరో క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయనీ దర్శక నిర్మాతలు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































