మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా బింబిసార. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమాను పెద్దగా హడావుడి లేకుండానే మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చేంత వరకూ ఈసినిమా ఒకటి కళ్యాణ్ రామ్ చేస్తున్నాడన్న సంగతి పెద్దగా ఎవరికీ తెలియదు. కెరీర్ లోనే మొదటి సారి డిఫరెంట్ కథతో, డిఫరెంట్ పాత్రతో వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రెండూ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు డేట్ ను వేదికను ఖరారు చేశారు మేకర్స్. జులై 29వ తేదీన ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగనుంది.
కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: