రామారావు ఆన్ డ్యూటీ: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం డ్యూటీ చేస్తా, అసలు వేట మొదలైంది వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బింబిసార: ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్ జులై 4వ తేదీ రిలీజ్అయిన విషయం తెలిసిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో గ్రాండియర్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కార్తికేయ 2 : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ” మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ జూన్ 28 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆసక్తికర విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లైగర్ : పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.తెలుగు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా జూలై 1 వ తేదీ విడుదల చేశారు. హిందీ ట్రైలర్ ని రణ్ వీర్ సింగ్ మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ రింగ్ లోకి ఎంటరవుతున్న విజువల్స్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.