లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!

Prabhas video riding on Lamborghini goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Latest Video,Prabhas Latest Movie Updates,Prabhas Latest Updates,Prabhas Latest News, Prabhas Video Goes Viral in Social Media,Prabhas Riding On Lamborghini Video Goes Viral in Social Media,Prabhas Upcoming Movies,Prabhas Saalar Movie Latest Updates,Prabhas Movie Updates, Prabhas on Lamborghini Video Goes Viral in Social Media,Prabhas Video in Social Media Goes Viral

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ప్రాజెక్ట్ కే. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఆశ్విన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను నాగ్ ఆశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ కు కోట్ల విలువ చేసే లాంబోర్గినీ కారు ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ కారులో అప్పుడప్పుడూ ప్రభాస్ చక్కర్లు కొడుతూ ఉంటాడు. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ కు తన లాంబోర్గినీపై వెళ్లి సందడి చేశాడు ప్రభాస్. ఈ కారులో మెరుపువేగంతో రైడ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ దివా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =