‘జిన్నా’ విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!

Vishnu Daughters to Make Debut With Ginna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Hero Vishnu,Vishnu Manchu,Vishnu Manchu Upcoming Movie,Vishnu Manchu Upcoming movie Ginna,Vishnu Daughter To Debut With Ginna Movie, Vishnu Daughters to Make Debut With Ginna Movie,Vishnu Daughters to Make Debut in Movies,Ariana and Viviana Manchu,Vishnu Manchu Daughters Ariana and Viviana to Debut in Ginna Movie

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ముగ్గురు కూడా ఎవరి కెరీర్ లో వారు కొనసాగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో తరం టైమ్ వచ్చింది. మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్ల ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో మంచు విష్ణు కూతుర్లైన అరియానా, వివియానా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈసినిమాలో నటిస్తుండటంతో పాటు ఒక పాటను కూడా పాడుతున్నట్టు తెలుస్తుంది. ఈవిషయాన్ని మంచు విష్ణు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఒక తండ్రిగా, నటుడిగా నా కుమార్తెలైనా అరియాన, వివియాన గాయనీమణులు, నటీమణులుగా మీ ముందుకు తీసుకొస్తున్నా.. నా రోబోయే చిత్రం జిన్నాలో అరియాన వివియాన కలిసి ఒక పాట పాడారు. ఆ పాట ఈనెల 24వ తేదీన ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్ కాబోతుంది అంటూ అధికారికంగా తెలియచేశారు. వాళ్లు నటీమణులు కావాలనేది నా కోరిక. కానీ వారు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది పూర్తిగా వారిష్టం.. వారు మొదలుపెడుతున్న ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశిస్సులు, అభినందనలు ఉంటాయని ఆశిస్తున్నా అంటూ తెలిపాడు.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =