‘బ్రహ్మాస్త్ర 2’ పార్వతి పాత్రలో దీపికా..?

Deepika Padukone in Brahmastra Part 2?,Brahmastra Part 2: Is Deepika Padukone A Part Of Ayan Mukerji’s Modern Mythology?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra part 2,Brahmastra Part 2 movie Updates,Brahmastra part 2 latest updates,Brahmastra Part 2 Actress Deepika padukone,Deepika Padukone to act in Brahmastra Part 2 Movie, Deepika padukone to act in Ayan Mukerjis Modern Mythology Movie Brahmastra part 2,Ayan Mukerjis Brahmastra Part 2 movie Updates,Ayan Mukerjis Upcoming Movie Brahmastra part 2 Movie, Ranbir Kapoor and Alia in Ayan Mukerjis Brahmastra Part 2 Movie,Deepika Padukone Parat of Ayan Mukerjis Mythology Movie Brahmastra Part 2,Ranbir Kapoor and Alia Bhatt,Deepika Padukone As Parvati, Deepika Padukone As Parvati in Brahmastra Part 2 Movie,Brahmastra Pan World Movie,Brahmastra Pan Indian Movie

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా మూడు భాగాలుగా వస్తుండగా.. అందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈసినిమాలో చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరిలో ఆమె కనిపిస్తుందని.. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అది నిజమే అని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో రణ్‌బీర్‌,ఆలియా చేసిన శివ-ఇషా పాత్రలు కీలకంగా ఉంటాయని.. వీటితో పాటు రెండో భాగంలో మరో రెండు పాత్రలు మహాదేవ్‌–పార్వతి కూడా కీలకంగా ఉంటాయని అంటున్నారు. ఈనేపథ్యంలో బ్రహ్మాస్త్ర-2’లో బలమైన పార్వతి పాత్ర కోసం దీపికను ఎంపిక చేశారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈపాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని అయాన్ చాలా పవర్ ఫుల్ గా ఈ పాత్రను రాశాడని అంటున్నారు. చూద్దాం మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో..

కాగా ఇంకా ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, కింగ్​ నాగార్జున, మౌని రాయ్ ఇంకా బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ కూాడా మరో ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eight =