రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విక్రమ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “విక్రమ్ “మూవీ తెలుగు తమిళ హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 8వ తేదీ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలోనూ సత్తా చాటింది.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు.తాజాగా
నాగచైతన్య “విక్రమ్” మూవీ పై ప్రశంసలు కురిపించారు. “విక్రమ్” మూవీ తనకు చాలా బాగా నచ్చిందనీ , పక్కా మాస్ ఫిల్మ్ అనీ నాగచైతన్య ప్రశంసించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: