‘మాచర్ల నియోజకవర్గం’ వెన్నెల కిషోర్ రోల్ రిలీజ్

Vennela Kishore Look From Macherla Niyojikavargam Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam Movie,Macherla Niyojikavargam Telugu Movie,Vennela Kishore Look From Macherla Niyojikavargam Revealed,Vennela Kishore Look From Macherla Niyojikavargam out Now, Vennela Kishore,Actor Vennela Kishore Look From Macherla Niyojikavargam Released,Hero Nithiin Macherla Niyojikavargam,Nithiin Upcoming Movie Macherla Niyojikavargam,Vennela Kishore Role in Macherla Niyojikavargam First Look Released

రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని పాత్రలను వరుసగా పోస్టర్ల ద్వారా రిలీజ్ చేయడం సంప్రందాయంగా మారిపోయింది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలోని పాత్రలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కృతిశెట్టి, సముద్రఖని పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కృతిశెట్టి ఈ సినిమాలో ‘స్వాతి’ పాత్రలో నటిస్తుండగా.. సముద్రఖని రాజప్ప పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో వెన్నెల కిషోర్ గుంతలకడి గురునాదం (ఇగో కా బాప్) అన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =