సమంత బాలీవుడ్ ఎంట్రీ పై తాప్సీ క్లారిటీ

Taapsee Pannu Gives Clarity About Samantha’s Entry in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Taapsee Pannu,Actress Taapsee Pannu,Taapsee Pannu latest Updates,Taapsee Pannu About Samantha,Taapsee Pannu About Samantha Entery in Bollywood,Taapsee Pannu and Samantha, Samantha,Samantha latest Movie Updates,Samantha Updates,Samantha New Movie Updates,Samantha Upcoming movies,Samantha New Movies,Samantha Pushpa The Rule Latest Updates, Samantha With Vijay Deverakonda,Samantha Upcoming Movie With Vijay Deverakonda

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక హిందీ వెబ్ సిరీస్, ఒక మలయాళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ మూవీస్ ఎంట్రీ పై పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత, తాప్సీ కలిసి ఒక బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారన్న వార్తకు క్లారిటీ వచ్చింది. స్టార్ హీరోయిన్ తాప్సీ కథానాయికగా తెరకెక్కిన “శభాష్ మిథు ” బాలీవుడ్ మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ కానుంది.”శభాష్ మిథు ” మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. సమంతతో తన ప్రొడక్షన్ లో ఒక సినిమా ను నిర్మిస్తున్నానని వెల్లడించారు. ఈ చిత్రంలో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని తెలిపిన తాప్సీ, సమంత లీడ్ పాత్రలో నటిస్తుందని క్లారిటీ ఇచ్చారు . సమంత పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారనీ , ఈ సినిమా చేయడానికి తను మాత్రమే పర్ఫెక్ట్ ఫిట్ అనీ తాప్సీ చెప్పారు. ఇక ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో సమంతకు మొదటి భారీ చిత్రం కాబోతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =