శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ అంచనాలతో రిలీజ్ కానున్న “ది వారియర్” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ మాస్ మసాలా ట్రైలర్ కేవలం 12 గంటల్లో 73 లక్షలకి పైగా వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ తరువాత “ది వారియర్” మూవీతో హీరో రామ్ మరోబ్లాక్ బస్టర్ హిట్ కొట్టనున్నారని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: