‘పక్కా కమర్షియల్’ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్..!

Pakka Commercial Best Opening,Pakka Commercial Movie Day 1 Collections Released By The Makers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie Collections,Pakka Commercial Box Office Collections, Pakka Commercial Movie Box Office Collections,Pakka Commercial Day 1 Collections Updates,Pakka Commercial Movie Latest Collections Updates,Pakka Commercial Movie latest Day1 collections Updates, Gopichand Pakka Commercial Movie Collections,Pakka Commercial Opening Day collections,Pakka Commercial Movie Review and Ratings,gopichand,Hero Gopichand Latest Movie Pakka Commercial collections, Gopichand Highest Opening Movie Pakka Commercial,Macho Star Gopichand Pakka Commercial Opening day Collections

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న జులై 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గోపీచంద్ కు కామెడీ యాంగిల్ కొత్తేమీ కాదు.. ఇక ఆ టైమింగ్ ను క్యాచ్ చేసిన మారుతి.. తన మార్క్ కు తగ్గట్టుగా తన కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది. మొదటి రోజు గోపీచంద్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు గోపీచంద్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈవిషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియచేసింది. ఈమధ్య కాలంలో వచ్చిన ‘సీటీమార్’ మొదటి రోజు దాదాపు 4.1 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం అయితే వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఈసినిమాకు బాగానే కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్య రాజ్‌, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేష్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =