నిర్మాతల కీలక నిర్ణయం.. 50 రోజుల త‌ర్వాతే ఓటీటీలోకి..!

50 Days Agreement For OTT Platforms

ఓటీటీల ప్రభావం ఇప్పుడు ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు కూడా ఓటీటీలు ఉన్నా కూడా కరోనా రావడంతో ఓటీటీ వాడకం మరీ ఎక్కువైపోయింది. కరోనా టైంలో థియేటర్లు లేకపోవడంతో పెద్ద సినిమాలు పక్కన పెడితే మినిమం బడ్జెట్ నుండి చిన్న సినిమాలు మొత్తం ఓటీటీలోనే రిలీజ్ అయిపోయాయి. పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు, థియేటర్లలోనే రిలీజ్ చేయలని వెయిట్ చేసిన కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీకి వెళ్లకుండా ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయి.. ఇప్పుడు థియేటర్లు ఫుల్ గా రన్ అవుతున్నా కూడా అదే పరిస్థితి నడుస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా వెంటనే ఓటీటీలోకి ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడం ఎందుకు ఓటీటీలో వచ్చేస్తుంది కదా చూసేయోచ్చులే అన్నా ధీమాతో కూడా ఉంటున్నారు. ఒక రకంగా ఓటీటీ వల్ల సినీ పరిశ్రమకు కొంత లాభం ఉన్నాకానీ అంతే నష్టం కూడా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీలోకి తెలుగు సినిమాల ఎంట్రీపై టాలీవుడ్ నిర్మాత‌లు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 50 రోజుల త‌ర్వాత మాత్ర‌మే సినిమాల‌ను ఓటీటీకి ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పెద్ద సినిమాలు విడుదలైన 8 వారాల అనంతరం ఓటీటీలో విడుదల చేయాలని.. చిన్న సినిమాలు విడుదలైన 6 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని.. ఈ విడుదల తీర్మానాలు జూలై 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇంకా వీటితో పాటు సినిమా టికెట్ ధరల విషయంలో కూడా చర్చలు జరిగినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.