అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య.. ఆస్కార్ కమిటీలో స్థానం..!

Suriya Achieves A Rare Feat,Indian Actor Suriya Gets An Invitation From The Oscars Committee,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Suriya,Hero Suriya,Tamil Hero Suriya,Suriya latest Updates,Suriya Movie Updates,Suriya latest News,Suriya Gets an Invitation From Oscar Committee,Tamil Star Hero Suriya Gets Invitation From Oscar committee, Suriya latest Movie Updates,Suriya upocming Movies,Suriya New Movie Updates,Indian Actor Suriya,Actor suriya,Hero Suriya Received Invitation From Oscar Committee Suriya is the first Kollywood star to achieve This,actress Kajol and directors Sushmit Gosh,Rintu Thomas,and Reema Kagti,members for the Oscars are AR Rahman, Amitabh Bachchan,Shah Rukh Khan,Aamir Khan,Salman Khan,Vidya Balan,Ekta Kapoor,and Shobha Kapoor,95th Academy Awards

తమిళ్ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడం సూర్యకు అలవాటే. అందుకే తన సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఇక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక రీసెంట్ గానే విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సూర్యకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ 2022) నుండి ఆహ్వానం వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 397మంది కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్యకు కూడా స్థానం లభించింది. దీంతో ఆస్కార్ క‌మిటీలో చేరిన తొలి ద‌క్షిణాది న‌టుడిగా సూర్య రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఇక సూర్యతో పాటు ఇండియా నుండి . కాజోల్‌ అలానే ఫీమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియాను రిప్రజంట్ చేయనున్నారు. కాగా సూర్య న‌టించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఆస్కార్ వ‌ర‌కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా.

కాగా తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో.. హీరో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ ను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 10 =