వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.‘ప్రాజెక్ట్ K ” మూవీ తాజా షెడ్యూల్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశం , ప్రభాస్ , దీపికా పడుకొనే లపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రాజెక్ట్ K ” మూవీ ఆఫీస్ హైదరాబాద్ గచ్చిబౌలి లో ప్రారంభం అయ్యింది. ఆఫీస్ ప్రారంభోత్సవం లో హీరోలు ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ , నాని , దుల్కర్ సల్మాన్ , దర్శకులు కె రాఘవేంద్ర రావు , ప్రశాంత్ నీల్ , నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. స్టార్ హీరోస్ , స్టార్ డైరెక్టర్స్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























